Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:14 PM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. సర్పంచ్ విక్రమ్

27-05-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే దిగుమతి చేసుకోవాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ అధికారులను, మిల్లర్లను కోరారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సుమారు ఆరు వేలకుపైగా ధాన్యపు బస్తాలు తూకం వేసి సిద్ధంగా ఉన్నప్పటికీ, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పలువురు అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

రైతుల సమస్యలను విన్న సర్పంచ్ విక్రమ్ స్థానిక రైతులతో కలిసి విద్య ఆగ్రో మిల్లును సందర్శించి నిర్వాహకులతో చర్చించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లు, అధికారులకు సూచించారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. సర్పంచ్ విక్రమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News