Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 05:56 AM

ధాన్యం కొనుగోళ్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ధాన్యం కొనుగోళ్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ధాన్యం కొనుగోళ్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
May 19, 2026 08:28 PM 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, నిర్ణీత సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డాటా నమోదు, ట్రక్ షీట్ తయారీ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని సూచిస్తూ, 24 గంటల్లోగా పురోగతి కనిపించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొన్ని రైస్ మిల్లుల వద్ద లారీలు నిలిచిపోతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే లారీలను ఖాళీ చేసి ధాన్యాన్ని దిగుమతి చేయాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా మిల్లుల వద్ద తహసీల్దార్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని తెలిపారు. కొంతమంది మిల్లర్లు సహకరించడం లేదని సమాచారం ఉందని, ప్రతి మిల్లులో ఎంత ధాన్యం దిగుమతి చేశారన్న వివరాలను సేకరించి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హమాలీల సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కరించాలని సూచించారు.పోలీసులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పరస్పర సమన్వయంతో పనిచేసి ధాన్యం రవాణా, లారీల కదలికలు, దిగుమతి ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిరోజూ మండలాల వారీగా ట్యాబ్ నమోదు, ట్రక్ షీట్ వివరాలను సిద్ధం చేసి పర్యవేక్షించాలని పౌరసరఫరాల అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 5 లక్షల 32 వేల 655 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. 5 వేల 573 మంది రైతుల ఖాతాల్లో రూ.89 కోట్ల 85 లక్షలు జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి బాల సరోజ వెల్లడించారు. అలాగే రైతుల ధాన్యం రక్షణ కోసం 3 వేల 520 టార్పాలిన్ కవర్లు పంపిణీ చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News