Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

ధాన్యం గింజ గింజా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు!

29-05-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం అండ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుర్కంటి వెంకటరెడ్డి భరోసా

మునుగోడు నియోజకవర్గ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుర్కంటి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు కష్టపడి పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

​శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే విషయంలో ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావద్దని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతోందని అన్నారు."కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమే రైతుల సంక్షేమం. అన్నదాతలకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది."​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో సహకరించాలని వెంకట్ రెడ్డి కోరారు. ముఖ్యంగా 'తేమ శాతం' పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Sthanikam

ధాన్యం గింజ గింజా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News