Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:53 AM

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి
20-03-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రేమ, శాంతి, దానగుణానికి నిదర్శనం రంజాన్: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, నెల రోజుల పాటు ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారని తెలిపారు. ఈనెల 21న జరగనున్న రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

సూర్యాపేట నియోజకవర్గంలో రంజాన్ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, సోదరభావానికి సూచికగా నిలుస్తుందని వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తితో ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ఈ పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News