Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్

డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్

డేటా నమోదు కచ్చితంగా చేయాలి..  కలెక్టర్
26-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగణనలో జాగ్రత్తలు తప్పనిసరి

భువనగిరి: జనాభా లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కచ్చితత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జనగణన–2027 ఫేజ్-1 గృహాల జాబితా, గృహ గణన (HLO) శిక్షణ తరగతుల చివరి రోజున కలెక్టర్ పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మార్గదర్శకాలు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని, సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డేటా సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

జనగణన నిబంధనలను పూర్తిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్‌లో చేస్తున్న పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News