Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:14 AM

దేశంలో రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

దేశంలో రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

దేశంలో రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
February 14, 2026 06:45 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K


మునగాల మండలం అంటనే ఒక చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి మండలమని,ముఖ్యంగా జగన్నాధపురం గ్రామంలో అనేకమంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేకమంది అసువులు బాసారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం మునగాల మండలం జగన్నాథపురం గ్రామంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక సభ లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో అనేక మంది అసువులు బాసారని, భూమికోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో జగన్నాధపురం గ్రామం నుండి అనేకమంది పాత్ర పోషించారని ఆయన అన్నారు. ప్రజలు ఓటు వేసి అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత విద్యతోపాటు, ఉచిత వైద్యాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి నేటికీ కూడా మహిళలకు ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడా బాబులకు అండగా ఉంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై సిపిఎం పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన అన్నారు. కేరళ రాష్ట్రంలో ఉన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రభుత్వం అనుసరించాలని ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలన్న, అలాంటి సమాజం కోసం పోరాడేది సిపిఎం పార్టీ ఎర్రజెండా మాత్రమే అని ఆయన అన్నారు. రేపు జరగబోవు ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలన్నారు. గ్రామాలలో ఉండే ప్రజలు కార్యకర్తలు తెగబడి పని చేయాలన్నారు. ఎర్రజెండా పక్షాన నిలబడడం కోసం ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, ములకపల్లి రాములు, డి వైఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సర్పంచ్ బొల్లం యమున, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చలికూర స్వరాజ్యం, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వరావు, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య, కొండారెడ్డి,సుందరయ్య,గోపయ్య శాఖ కార్యదర్శి లు బుత్తం వెంకన్న,దైద సైదులు, ఎస్కే ఖాజాబి ఖాదర్ సైదులు,కలకొవ సర్పంచ్ వెంకటాద్రి,నర్సింహులగూడెం సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య, వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్ లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News