Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి

19-03-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వాస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచాలన్న డిమాండ్‌కు అధికారుల మద్దతు లభించింది.

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షను బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్ నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రజల డిమాండ్ సమంజసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, నూతన భవనాలు నిర్మించడం అత్యవసరమని పేర్కొంటూ, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ, “ఆస్పత్రి అప్‌గ్రేడ్ సాధించే వరకు పోరాటం ఆగదు” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్‌కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వాస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచాలన్న డిమాండ్‌కు అధికారుల మద్దతు లభించింది.

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షను బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్ నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రజల డిమాండ్ సమంజసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, నూతన భవనాలు నిర్మించడం అత్యవసరమని పేర్కొంటూ, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ, “ఆస్పత్రి అప్‌గ్రేడ్ సాధించే వరకు పోరాటం ఆగదు” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News