Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

27-02-2026 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రివ్ అలీవ్ కాంపెయిన్ –2026 కార్యక్రమంలో భాగంగా గురువారం మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ ) సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, వారి సిబ్బంది హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, సురక్షిత ప్రయాణంతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

Article Image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రివ్ అలీవ్ కాంపెయిన్ –2026 కార్యక్రమంలో భాగంగా గురువారం మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ ) సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, వారి సిబ్బంది హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, సురక్షిత ప్రయాణంతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News