Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

డ్రగ్స్‌కు నో చెప్పాలి: యువతకు ఏసీపీ శివం నాయుడు పిలుపు

24-03-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కూసుమంచి గ్రామంలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఈగల్ టీం ఏసీపీ శివం నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏసీపీ శివం నాయుడు మాట్లాడుతూ, సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ అనే మత్తు పదార్థాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని, ఒకసారి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని అన్నారు.

సర్పంచ్ కొండా క్రిష్ణవేణి మాట్లాడుతూ, గ్రామాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత చదువు, క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు.

మండల విద్యాశాఖ అధికారి రాయల వీరస్వామి మాట్లాడుతూ, డ్రగ్స్ అనే సామాజిక ముప్పు నుండి యువత దూరంగా ఉండి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబాలపై పడే ప్రభావాల గురించి వివరించారు.

కూసుమంచి ఎస్సై నాగరాజు మాట్లాడుతూ, చెడు స్నేహాల వల్ల కొంతమంది యువకులు మత్తు పదార్థాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బిక్షం నాయక్, వెంకటేష్ నాయక్, గ్రామ పంచాయతీ సభ్యులు, కార్యదర్శి నీరజ, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో నిర్వాహకులు ముఖ్య అతిథికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

డ్రగ్స్‌కు నో చెప్పాలి: యువతకు ఏసీపీ శివం నాయుడు పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News