Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:01 AM

డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి: అదనపు ఎస్పీ చైతన్య పిలుపు

02-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా శనివారం సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు పోలీసు సూపరింటెండెంట్ చైతన్య మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల శారీరక, మానసిక సామర్థ్యాలు దెబ్బతిని భవిష్యత్తు నాశనం కావచ్చని హెచ్చరించారు. యువత తాత్కాలిక ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై ఏకాగ్రత పెంచుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు వంటి ఆధునిక సమస్యలపై కూడా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ యువత డ్రగ్స్ ప్రమాదాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం డీఎస్పీ పుష్పస్ కుమార్, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, సత్తయ్య, డీసీపీఓ రత్నం, ఏఎఫ్‌డబ్ల్యుఓ సతీష్, లింగం, యాదగిరి, డీసీపీఎస్ సిబ్బంది, ఓమేరా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి: అదనపు ఎస్పీ చైతన్య పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News