Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి

17-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ల్లాలో డ్రగ్స్, మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.

మంగళవారం మినీ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అక్షణష్ యాదవ్ , అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ , చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి తో పాటు వైద్య, విద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ రవాణా, వినియోగం చేసే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలలు, కర్మాగారాల్లో ప్రత్యేక నిఘా ఉంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, అలవాటు పడితే జీవితంపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలియజేయాలని అన్నారు. మున్సిపల్, గ్రామపంచాయతీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చదువు మధ్యలో మానేసిన యువతపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు.

జిల్లాలో గంజాయి రవాణా, సరఫరా చేసిన వారిపై పోలీసులు 7 కేసులు, ఎక్సైజ్ శాఖ 3 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో డ్రగ్స్, గుడుంబా నిర్మూలనకు కృషి చేయాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ కళాశాలలు, కర్మాగారాలు, గ్రామాలలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి మనోహర్ , జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News