Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిపిఎం పార్టీ పోరాట ఫలితమే నేడు రైతులకు భూమి పట్టాలు ;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:07 PM

దళితులను రక్షించెందుకే జాతీయ ఎస్సీ కమిషన్...

16-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కర్ల రాజేష్ హత్య కేసు పై చార్జ్ షీట్ ఎందుకు వేయలేదు...

సీఐతోపాటు వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలి...

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ స్పష్టం....

దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ స్పష్టం చేశారు. సోమవారం కోదాడ పట్టణంలో ఇటీవల పోలీసు లాక్ అప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ తల్లి లలితమ్మతో రాజేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ నుండి మంజూరైన పెన్షన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ నందలాల్ పవర్,అడిషనల్ డీజీ చౌహన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సమక్షంలో అందజేశారు. అనంతరం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కేసు వివరాలను అధికారులతో దర్యాప్తు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కర్ల రాజేష్ కేసు పత్రికల్లో చూసి ఎస్సీ కమిషన్ సుమోటో కింద కేసు నమోదు చేసిందన్నారు. కమిషన్ కేసులో ప్రవేశించిన అనంతరం ఎఫ్ఐఆర్ చేశారని అంతకుముందు జరగలేదన్నారు. రాజేష్ మృతి పై నేటి వరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో బాధ్యులైన సిఐని సస్పెండ్ చేయడమే కాదు ఎస్సైని వారం రోజుల్లో సస్పెండ్ చేయాలని అడిషనల్ డీజీ,జిల్లా ఎస్పీని ఆదేశించారు. పది రోజుల్లో రీ పోస్టుమార్టం చేసి నివేదికను అందించాలని ఆదేశించారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సెక్షన్ 4 ప్రకారం కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు జవాబు ఇవ్వకపోతే నిర్లక్ష్యపు చట్టం ప్రకారం సస్పెన్షన్ తో పాటు ఆరు నెలలు జైలు ఉంటుందని హెచ్చరించారు. రాజేష్ తల్లికి మూడు రోజుల్లో ఉద్యోగం, పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మూడు ఎకరాల భూమి ఆరు నెలల్లో ఇచ్చేందుకు కలెక్టర్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, అడిషనల్ డీజీ చౌహన్, కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ పవర్, ఎస్పీ నరసింహ,ఆర్డీవో సూర్యనారాయణ, డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ,ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ

34 వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి

వంగవీటి శ్రీను,ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు,ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు యలమర్తి రాము, కొండపల్లి ఆంజనేయులు, వడ్డేపల్లి కోటేష్, యాతాకుల రాజన్న, కుడుముల శ్రీను, ఏపూరి సత్యరాజు,పిడమర్తి వెంకట్రావు , బిజెపి నుండి నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, అంజి యాదవ్,

బచ్చలకూరి ప్రసాద్, చింత్రాల బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు........

Sthanikam

దళితులను రక్షించెందుకే జాతీయ ఎస్సీ కమిషన్...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News