Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

26-03-2026 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కుల కుటుంబాలు ఏప్రిల్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రవాణా, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం వంటి విభాగాల్లో బ్యాంకు రుణంతో పాటు 100 శాతం సబ్సిడీతో పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, యంత్రాల హైరింగ్ సెంటర్లు, సోలార్ పంప్ సెట్లు, పాడి గేదెల పంపిణీ వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా వేతన, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండే వారు అర్హులని స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), భూమి పత్రాలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

Sthanikam

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News