Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:53 AM

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: బిషప్ దుర్గం ప్రభాకర్

16-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హుజూర్నగర్, : భారతదేశం లౌకిక దేశమై అన్ని మతాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ అన్నారు.

హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చింతల బజారు అభిషేక్తుని ప్రార్థన మందిరంలో జిల్లా నాయకులు పాస్టర్ ఉటుకూరి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు. 2004లో ఏర్పాటు చేసిన రంగనాథ్ మిశ్రా జాతీయ కమిషన్ 2007లో సమర్పించిన నివేదికలో దళిత క్రైస్తవులు వివక్షను ఎదుర్కొంటున్నారని స్పష్టంగా తెలిపిందని, ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎస్సీ హోదాను హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే పరిమితం చేయడం దళిత క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు.

దేశంలో దళిత క్రైస్తవులు సామాజిక, ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇతర కులాల వారు క్రైస్తవ మతంలోకి మారినా తమ కుల హోదాను కొనసాగించుకుంటున్నారని, అదే విధంగా దళిత క్రైస్తవులకు కూడా హక్కులు కల్పించాలని కోరారు.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని, త్వరలోనే నాయకులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిషప్ ముల్లంగి జాకబ్ రాజు, రెవ. డా. మెసా దేవసహాయం, రెవ. డా. జలగం జేమ్స్, తలకప్పల దయాకర్, మాతంగి పీటర్, రెవ. బొక్క ఏలీయా రాజు, రెవ. డా. డి. జాన్ ప్రకాష్, రెవ. ఏర్పుల క్రిస్టోఫర్, రెవ. పంది మార్క్, పాస్టర్ కొండేటి లాజర్, పాస్టర్ ప్రేమ్ సాగర్, పిట్టల సామెల్, రెవ. సి. హెచ్. కిరణ్ కుమార్, రాపోలు పిలిఫ్, గుగులోత్ రవి నాయక్, కొత్తపల్లి జోసెఫ్, సంజీవ్ కుమార్, బండారు సొలొమోను, మామిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: బిషప్ దుర్గం ప్రభాకర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News