Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:42 AM

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి
16-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్ టి. వెంకట రామరావు ఆత్మశాంతి కోసం నిర్వహించిన ఉదక శాంతి మరియు ద్వాదశ దిన (12వ రోజు) కర్మ కార్యక్రమాలు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ క్రతువులు సాగాయి.

తన పెద్దనాన్న కుమారుడు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ జితేందర్ రావు తనుగుల ఈ కార్యక్రమాలను కుటుంబ బాధ్యతగా భావించి అంత్యక్రియల నుంచి ద్వాదశ దిన కర్మ వరకు అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆయన సతీమణి రేణుకతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై మరణించిన వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు. డాక్టర్ రామరావు ధర్మపత్ని శ్రీదేవి (చిన్నమ్మ) తన భర్తతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుమార్తెలు శిరీష, హిమబిందు, ఇందిర ప్రియదర్శిని తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అల్లుడు శశికుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు సతీష్ కుమార్, శశికళ, జ్యోతి, సుహర్షి, హర్ష, చంద్రిక, ధనుష్ మరియు మనవలు, మనవరాళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖులు డాక్టర్ టి.ఆర్.కే. రావు (డైరెక్టర్ జనరల్, మైనింగ్ – నాగ్‌పూర్), డాక్టర్ జితేందర్ రావు తల్లి రేవతి తదితరులు హాజరై నివాళులర్పించారు. కార్యక్రమం విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగేందుకు శ్రీ సదాశివరావు విష్ణుదాస్ విశేష కృషి చేశారు.

Sthanikam

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News