Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:37 AM

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: నీలం మధు ముదిరాజ్..

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: నీలం మధు ముదిరాజ్..

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: నీలం మధు ముదిరాజ్..
February 20, 2026 11:30 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పెద్ద శంకరంపేటలో ఘనంగా గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ..

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వచ్చిన ఆయనకు నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ భక్తి మార్గం ద్వారానే మనిషికి సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. దైవ చింతనతో మనసుకు స్థిరత్వం, జీవనానికి దిశ లభిస్తాయని చెప్పారు. గ్రామాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రజల మధ్య సోదరభావం పెంపొందుతుందని, ఐక్యత మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.గంగమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై నిలిచి ఉండాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా వర్థిల్లాలని ఆకాంక్షించారు.ఉత్తులూరు గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరుడి శ్రావణిసాయిలు, మాజీ సర్పంచ్ మంద మల్లేష్, సతీష్, పెంటయ్య, దుర్గయ్య, బ్యతయ్య, చంద్రయ్య, సాయిలు, దశరథ్, సంగయ్య, అశోక్, రాములు, పెంటన్న, ఈర గౌడ్, ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం భక్తి భావంతో, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News