Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన

22-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిరుమలగిరి: మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉండగా, వాటిని కొంతమంది భూస్వాములు, స్థానికులు పశువుల కొట్లుగా ఉపయోగించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజాధనంతో నిర్మించిన ఈ ఇండ్లలో ప్రజలు నివసించాల్సి ఉండగా, బర్లకు, గొర్రెలకు, గడ్డి కట్టలకు, ఎడ్ల బండ్లకు, ట్రాక్టర్లకు నిల్వగా ఉపయోగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇండ్లు లేని పేద కుటుంబాలు గత నెల రోజులుగా అక్కడికక్కడే చెట్ల కింద, పిల్లర్ల వద్ద వంట చేసుకుంటూ ఎండలోనే నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “ఈ పశువులను, బండ్లను, గడ్డివాములను ఖాళీ చేస్తే మేము శుభ్రం చేసుకుని ఉంటాం” అంటూ వేడుకున్నా, ఆక్రమణదారులు కనికరం చూపడంలేదని వారు వాపోతున్నారు.

అంతేకాకుండా రాత్రి వేళల్లో మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడుతూ, కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న బెల్లి యాదగిరి సహా పలువురు ఈ ఇండ్లను ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. వారిలో షీలా ఆగయ్య, కన్నబోయిన లింగయ్య, కన్నెబోయిన కోటయ్య, ఎరుపుల లింగస్వామి, మెరుగు వెంకన్న, వజ్జే లింగయ్య, మెరుగు కనకయ్య, మెరుగు గణేష్, రఘు, వజ్జే శంకరమ్మ తదితరులు ఉన్నారని తెలిపారు.

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News