Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు

26-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ,

మండలంలోని చిత్తాపురం గ్రామం నుండి గోపరాజుపల్లి వరకు ఉన్న రహదారిని తక్షణమే విస్తరించాలని సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ రహదారి సుమారు 33 అడుగుల వెడల్పుతో ఉండేదని, కాలక్రమేణా ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 12 నుంచి 13 అడుగులకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. ఫలితంగా రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

తక్షణమే భూసర్వే నిర్వహించి రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించి, రెండు వాహనాలు సులభంగా వెళ్లే విధంగా రహదారిని విస్తరించాలని రెవెన్యూ అధికారులను కోరారు. అధికారులు స్పందించని పక్షంలో చిత్తాపురం, గోపరాజుపల్లి గ్రామాల ప్రజలను సమీకరించి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు

Article Image

వలిగొండ,

మండలంలోని చిత్తాపురం గ్రామం నుండి గోపరాజుపల్లి వరకు ఉన్న రహదారిని తక్షణమే విస్తరించాలని సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ రహదారి సుమారు 33 అడుగుల వెడల్పుతో ఉండేదని, కాలక్రమేణా ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 12 నుంచి 13 అడుగులకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. ఫలితంగా రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

తక్షణమే భూసర్వే నిర్వహించి రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించి, రెండు వాహనాలు సులభంగా వెళ్లే విధంగా రహదారిని విస్తరించాలని రెవెన్యూ అధికారులను కోరారు. అధికారులు స్పందించని పక్షంలో చిత్తాపురం, గోపరాజుపల్లి గ్రామాల ప్రజలను సమీకరించి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News