Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం

26-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరణ

చింతలపూడి: గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చడంలో కో-ఆపరేటివ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తక్కువ వడ్డీతో రుణాలు, ఆకర్షణీయ డిపాజిట్ పథకాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు ఈ సొసైటీ ద్వారా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యాక్స్ సొసైటీ చైర్మన్ మరియు సీఏ దాకారపు కృష్ణ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పారదర్శకంగా సేవలు అందిస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సహకారం కొనసాగాలని కోరారు.

కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు, కూటమి ప్రతినిధులు, బ్యాంకు నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News