Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

చింతలపూడికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరు

24-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి పట్టణానికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరుకానున్నాయి. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ న్యాయశాఖ మంత్రి మరియు న్యాయశాఖ కార్యదర్శి లను శుక్రవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

చింతలపూడిలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు భవనాలు అత్యవసరమని ఎమ్మెల్యే వివరించారు. అలాగే కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)ను నియమించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కార్యదర్శి జి. ప్రతిభా దేవి స్పందిస్తూ, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు అదనపు జూనియర్ సివిల్ కోర్టు భవనాలను మంజూరు చేస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం పూర్తయ్యాక ఏజీపీని నియమించే ప్రక్రియ చేపడతామని తెలిపారు.

ఈ నిర్ణయంతో చింతలపూడి ప్రాంత ప్రజలకు న్యాయసేవలు మరింత సులభతరం కానున్నాయి.

Sthanikam

చింతలపూడికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరు

Article Image

చింతలపూడి పట్టణానికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరుకానున్నాయి. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ న్యాయశాఖ మంత్రి మరియు న్యాయశాఖ కార్యదర్శి లను శుక్రవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

చింతలపూడిలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు భవనాలు అత్యవసరమని ఎమ్మెల్యే వివరించారు. అలాగే కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)ను నియమించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కార్యదర్శి జి. ప్రతిభా దేవి స్పందిస్తూ, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు అదనపు జూనియర్ సివిల్ కోర్టు భవనాలను మంజూరు చేస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం పూర్తయ్యాక ఏజీపీని నియమించే ప్రక్రియ చేపడతామని తెలిపారు.

ఈ నిర్ణయంతో చింతలపూడి ప్రాంత ప్రజలకు న్యాయసేవలు మరింత సులభతరం కానున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News