Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

12-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మండల వ్యాప్తంగా 417 మంది విద్యార్థులు హాజరు , 3 కేంద్రాలు ఏర్పాటు.

పరీక్ష హాలులోకి పౌచులు, బాక్సులు అనుమతి లేదు

నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు చిట్యాల మండల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ చిట్యాల ​మండల వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది

​మొత్తం 417 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 238 మంది బాలురు, 179 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 221 మంది, ప్రైవేట్ పాఠశాలల నుండి 196 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిట్యాల గ్రీన్ గ్రోవ్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు . పరీక్షా కేంద్రాలలో మొత్తం 34 మంది సిబ్బందిని నియమించారు అందులో 28 మంది ఇన్విజిలేటర్లు ఆరుగురు టీఎస్ బి ఓ లు ను నియమించారు పరీక్షా సమయానికి గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ సూచనల మేరకు ఐదు నిమిషాల ఆలస్యంతో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి కవర్లు గాని, పౌచులు గాని, జామెంట్రీ బాక్సులు గాని పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. విద్యార్థులు కేవలం పెన్నులు, పెన్సిల్లు, స్కేలు, వంటి పరీక్షా సామాగ్రి మాత్రమే పరీక్షా గదిలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామని సైదా నాయక్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.

Sthanikam

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News