Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:20 PM

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

09-03-2026 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతు కూలీల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి

చిట్యాల మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు మరియు పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిట్యాల మున్సిపల్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పాలకవర్గ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో మరియు మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అలాగే వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు ప్రజలకు ప్రమాదకరంగా మారాయని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా చిట్యాల మున్సిపల్ పరిధిలో రైతులు మరియు రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించేందుకు ఒక కేంద్రంగా ఈకార్యాలయంఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News