Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్త తరంగం సీనియర్ నేతలకు షాక్

13-02-2026 657 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ముఖాల దుమ్మురేపు

సీనియర్ నాయకులకు షాక్ – వార్డు అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు

చిట్యాల మున్సిపల్ ఎన్నికలు ఈసారి రాజకీయ వాతావరణాన్ని ఊహించని మలుపుతిప్పాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో పట్టు సాధించిన సీనియర్ నాయకులపై నూతనంగా రాజకీయ రంగప్రవేశం చేసిన అభ్యర్థులు ఘనవిజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. యువత, మహిళలు, కొత్త ఆలోచనలకు ప్రజలు మద్దతు పలికారన్న సంకేతాలు ఈ ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ముఖ్యంగా ఒకటవ వార్డు నుంచి ట్రాన్స్లేటర్‌గా పరిచయం ఉన్న నాగిల్ల సుధాకర్ అలియాస్ కావేరి విజయం సాధించడం విశేషం. రెండో వార్డు నుంచి షేక్ షబానా అజీమ్ కౌన్సిలర్‌గా ఎన్నికై మహిళా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేశారు. ఏడవ వార్డులో దేశపాక లతా రాజేష్, ఎనిమిదవ వార్డులో జేరిపోతుల సత్యనారాయణ, పదో వార్డులో నిమ్మనగోటి శ్రీనివాస్ గెలుపొందడం ద్వారా కొత్త తరానికి చిట్యాల ప్రజలు అవకాశం ఇచ్చారు.ప్రచార సమయంలో వీరు స్థానిక సమస్యలపై దృష్టి సారించి, పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు–డ్రైనేజీ సమస్యల పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటుపై హామీలు ఇచ్చారు. సీనియర్ నాయకుల అనుభవానికి పోటీగా కొత్త ఆలోచనలు, ప్రజలతో నేరుగా మమేకమవడం వీరి విజయానికి దోహదపడిన అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఫలితాలతో చిట్యాల రాజకీయాల్లో కొత్త వరవడి ప్రారంభమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎన్నికల హామీలను అమలు చేసి వార్డు అభివృద్ధిని వేగవంతం చేయగలరా అన్నది వేచి చూడాల్సిందే. ప్రజల ఆశలు, అంచనాలు భారీగా ఉన్న ఈ నేపథ్యంలో నూతన కౌన్సిలర్లు తమ పనితీరుతో విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్త తరంగం సీనియర్ నేతలకు షాక్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News