Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

చిట్యాల గ్రోమోర్ సెంటర్‌పై వ్యవసాయ శాఖ చర్యలు

20-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని గ్రోమోర్ సెంటర్‌లో రైతులకు డీఏపీ, కాంప్లెక్స్ వంటి రసాయన ఎరువులతో పాటు ఆర్గానిక్ ఎరువులను బలవంతంగా లింకు పెట్టి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా FCO 1985 క్లాజ్ 28 ప్రకారం గ్రోమోర్ సెంటర్‌పై చర్యలు తీసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి బాబు తెలిపారు.

దీని ప్రకారం భూ ఔషధ్ మరియు ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువుల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం గ్రోమోర్ సెంటర్‌లో నిల్వ ఉన్న భూ ఔషధ్, ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువులను పూర్తిగా సీజ్ చేసినట్లు వెల్లడించారు.రైతులు ఇకపై ఎలాంటి ఆర్గానిక్ ఎరువుల లింకు లేకుండా రసాయనిక ఎరువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి సూచించారు.

Sthanikam

చిట్యాల గ్రోమోర్ సెంటర్‌పై వ్యవసాయ శాఖ చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News