Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:54 AM

చిట్‌ఫండ్ మోసం బట్టబయలు.. అక్షర సంస్థ అధిపతి అరెస్ట్

20-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆదిలాబాద్:

చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడిన అక్షర చిట్‌ఫండ్ సంస్థ అధిపతి పేరాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా పోలీసు అధికారి అఖిల్ మహాజన్ తెలిపారు.

హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో చిట్‌ఫండ్ వ్యాపారం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల చిట్టీ పథకాలు నిర్వహించారు. వందలాది మందినుంచి భారీగా డిపాజిట్లు సేకరించి గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు.

ఆదిలాబాద్ పట్టణంలోనే పన్నెండు కేసులు నమోదు కాగా బాధితులకు కోటి పదకొండు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో మొత్తం తొంభై ఆరు కేసులు నమోదయ్యాయని చెప్పారు. గత ఆరు నెలలుగా పరారీలో ఉన్న నిందితుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి ఆదిలాబాద్‌లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

నిందితుడికి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని, ఇప్పటికే కొన్ని ఆస్తులను జప్తు చేయగా మిగిలిన వాటిని కూడా చట్టపరంగా జప్తు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Sthanikam

చిట్‌ఫండ్ మోసం బట్టబయలు.. అక్షర సంస్థ అధిపతి అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News