Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:02 AM

చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం

01-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత–మాదకద్రవ్య రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని ప్రత్యేక బాల ఆరోగ్య కేంద్రంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఆరోగ్య ప్రమాదాల గుర్తింపు పరీక్షలను జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, వైద్యులు డాక్టర్ శశాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు, ఎదుగుదల లోపాలు, అభివృద్ధి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటా సర్వే నిర్వహించి ప్రమాదంలో ఉన్న పిల్లలను గుర్తించి ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అలాంటి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సేవలు, ఇతర వైద్య కేంద్రాలకు పంపించే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. చిన్న వయస్సులోనే సమస్యలను గుర్తిస్తే వారిని సాధారణ స్థితికి తీసుకురావడం సులభమవుతుందని పేర్కొన్నారు. డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ ప్రమాదంలో ఉన్న పిల్లలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శస్త్రచికిత్సలు, వ్యాయామ చికిత్స, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో ఆరోగ్య సమస్యలు గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమయ్యే అవకాశముందని, అందుకే ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా గుర్తించి ప్రత్యేక బాల ఆరోగ్య కేంద్రానికి తరలించి సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట తదితర ప్రాంతాల నుంచి 24 మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ సమన్వయకర్త నవీన్ చారి, సిబ్బంది లింగం, యాదగిరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News