Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:51 PM

చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

24-02-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీసీలపై అగ్రకుల దాడులు ఆగాలన్న టిఆర్పీ ఆగ్రహం

నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా చాకలి కులస్తులపై జరిగిన దాడి ఘటనలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్పీ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల దురహంకారం నశించాలన్నారు. బీసీలపై అగ్రకుల దాడులు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయని అన్నారు.

ఏడు దశాబ్దాలుగా తక్కువ శాతం ఉన్న అగ్రకులాల చేతుల్లో అధికారాన్ని కేంద్రీకరించడం వల్లే బహుజన కులాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రజక కులస్తులపై దాడి చేసిన వారితో పాటు చిన్నారి మృతికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా కార్యదర్శి మీర్ అక్బర్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్ యాదవ్, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి గౌడ్, ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య యాదవ్, యెగ్గడి మురళి, మామిడి శోభన్, తగుళ్ల జనార్ధన్, భారీ అశోక్, లింగయ్య యాదవ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, రజక ఉద్యోగ సంఘం నాయకులు దామెర శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్, మాచర్ల కృష్ణ, టిఆర్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News