Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

10-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు ఈస్ట్ డి.సి.పి.కృష్ణ కాంత్ పటేల్ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను ఆధారంగా చేసుకుని అత్యంత పటిష్టంగా బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది.

ఉత్సవాల సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో, జన సమూహ నియంత్రణలో అని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాల ద్వారా నిఘా, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక ఏర్పాట్లతో పాటు అన్నీ శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పెద్ద కార్యక్రమాలలో భక్తుల రద్దీ నేపథ్యంలో చిన్నపిల్లలు తప్పిపోవడం వారిని వెతుకుంటూ వారి కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తొలగించడానికి గత సంవత్సరం జిల్లా యంత్రాంగం వారు చిన్న పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను పిల్లలకు వేయించడం జరిగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు గుణదల మేరీమాత టెంపుల్ పరిసర ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం ఐ.సి.డి.ఎస్., రెవెన్యూ, ఫోరం ఫర్ చైల్డ్ టీం వారు పలు బృందాలుగా ఏర్పడి తిరునాళ్ళకు వచ్చిన చిన్న పిల్లలకు వారి వివరాలను పొందుపరిచిన చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏ.సి.పి. కె.దామోధర్ , మాచవరం ఇన్స్పెక్టర్ డి.వి.రమణ , ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అదికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

Article Image

విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు ఈస్ట్ డి.సి.పి.కృష్ణ కాంత్ పటేల్ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను ఆధారంగా చేసుకుని అత్యంత పటిష్టంగా బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది.

ఉత్సవాల సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో, జన సమూహ నియంత్రణలో అని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాల ద్వారా నిఘా, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక ఏర్పాట్లతో పాటు అన్నీ శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పెద్ద కార్యక్రమాలలో భక్తుల రద్దీ నేపథ్యంలో చిన్నపిల్లలు తప్పిపోవడం వారిని వెతుకుంటూ వారి కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తొలగించడానికి గత సంవత్సరం జిల్లా యంత్రాంగం వారు చిన్న పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను పిల్లలకు వేయించడం జరిగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు గుణదల మేరీమాత టెంపుల్ పరిసర ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం ఐ.సి.డి.ఎస్., రెవెన్యూ, ఫోరం ఫర్ చైల్డ్ టీం వారు పలు బృందాలుగా ఏర్పడి తిరునాళ్ళకు వచ్చిన చిన్న పిల్లలకు వారి వివరాలను పొందుపరిచిన చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏ.సి.పి. కె.దామోధర్ , మాచవరం ఇన్స్పెక్టర్ డి.వి.రమణ , ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అదికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News