Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:26 AM

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు

24-03-2026 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శిబిరాల్లో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలతో పాటు వివిధ వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.

జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్ నిపుణులు, నేత్ర వైద్యులు పాల్గొని కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందిస్తారని పేర్కొన్నారు. అన్ని మండలాల్లో దశల వారీగా ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అవసరమైన వారికి ఉచితంగా మందులు, చికిత్సలు అందించడంతో పాటు, తీవ్రమైన కేసులను రిఫరల్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలిపారు. చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు.

Sthanikam

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News