Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే క్రీడలు మార్గం డి.ఎస్.పి శివరాం రెడ్డి

15-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

క్రీడల వల్ల యువతలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతుందని నలగొండ జిల్లా డిఎస్పి శివరాం రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి అక్కడ ఉన్న పలువురిని ఆకర్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి కలిగిస్తాయని, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు అంతేకాకుండా క్రీడలతో యువత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చు అని తెలియజేశారు నేటి సమాజంలో యువత ఎక్కువగా గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ వంటి దురాలవాట్లకు లోనై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని అన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లo మహేష్, వార్డు మెంబర్ నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, దేశబోయిన లింగస్వామి, సురకంటి మోహన్ రెడ్డి, దేశబోయిన నరసింహ, బొంతల సాయి ప్రసాద్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, గోలి సాయికిరణ్, కునూరు గణేష్, శ్రీకాంత్, అరూరి పవన్, ఆరూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే క్రీడలు మార్గం డి.ఎస్.పి శివరాం రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News