Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

చౌటుప్పల్‌లో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

03-04-2026 375 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు వేగంగా స్పందించి రెండు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం, తేదీ 02.04.2026 ఉదయం 08.30 గంటల సమయంలో మల్కాపురం గ్రామానికి చెందిన సిద్దగొని నర్సమ్మ (48) తన అక్క అళివేలు తో కలిసి ధర్మకొల్ కంపెనీకి వెళ్తుండగా మార్గమధ్యంలోని దర్గాహ్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు వారి వెంట వచ్చి, ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ చైన్‌ను బంగారం చైన్‌గా భావించి బలవంతంగా లాక్కొని పారిపోయారు.ఈ ఘటనపై బాధితులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు Cr.No. 164/2026, U/s 309(4) BNS కింద కేసు నమోదు చేశారు.

యాదాద్రి-భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాలు, డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు, ఇన్స్పెక్టర్ మన్మధకుమార్, ఎస్‌ఐ కనకటి యాదగిరి, పోలీసు సిబ్బంది వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రెండు గంటల్లోనే మల్కాపురం గ్రామంలోని ఆందోల్ మైసమ్మ గుడి సమీపంలో నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన నిందితులు ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ సయీద్ (25), బోడ చరణ్ (18)గా గుర్తించారు.

వారి వద్ద నుండి రోల్డ్ గోల్డ్ చైన్ (రూ.1,000 విలువ), ఒక నోకియా కీప్యాడ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన నిందితులను 03.04.2026న కోర్టులో హాజరు పరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.

Sthanikam

చౌటుప్పల్‌లో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News