Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

చౌటుప్పల్ టోల్‌ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత

19-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నలుగురు అరెస్ట్ – 60.685 కేజీల ఎండు గంజాయి స్వాధీనం

రామన్నపేట: ఒడిశా రాష్ట్రంలోని భరంపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 60.685 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద మంగళవారం పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు.

బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్లు తెలిపారు.

మహిళలపై అనుమానం రాకుండా ఉండేందుకు వారిని ఉపయోగించి రవాణా చేయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్రమంగా మత్తుపదార్థాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన గంగాబాయి పాండురంగ్ చౌహాన్, కమల్ మోహితే, విజయ్ ఆసారం గోరపడే కాగా, మరొకరు నల్లగొండ జిల్లా వాసి వల్లపు దాసు వేణుకుమార్‌గా గుర్తించారు.

రామన్నపేట, మోత్కూర్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు ఆర్. బాళోజి నాయక్, కె. రవిచంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేసి బుధవారం రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు.

ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐలు ఎన్. శంకర్, బి. శివకృష్ణ, పి. సత్యనారాయణతో పాటు కానిస్టేబుళ్లు తిరుమలేష్, రావోజీ, అనిల్, కృష్ణారెడ్డి, గోపీనాథ్ రెడ్డి, వెంకట్, రహమాన్, రమేష్ రెడ్డి, సోనీ, స్వప్న పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ టోల్‌ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News