చౌడమ్మ జాతరలో దిష్టి పూజలు ఘనం
చౌడమ్మ జాతరలో దిష్టి పూజలు ఘనం
Biksham
సూర్యాపేట మండలంలో టేకుమట్ల గ్రామంలో యాదవ కులస్తులు నిర్వహించిన చౌడమ్మ జాతర దిష్టి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలను, గ్రామీణ సంస్కృతిని పరిరక్షించడంలో ఇటువంటి జాతరలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, మాజీ సర్పంచ్ తూర్పుగూడె శ్రీనివాస్, నాయీబ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు సూపర్ సైదులు, నేలచర్ల మధు ప్రజాపతి, లింగాల సైదులు, వట్టే లింగరాజు, గుంటూరు విజయ్, కిరణ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ పెద్దలు జలా సైదులు, ఉప్పల సౌడయ్య, బొర్రా జానయ్య, ఉప్పల శ్రీను, లింగయ్య, కొరవి, సతీష్, సందీప్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల భారీ పాల్గొనికతో జాతర ఉత్సాహభరితంగా సాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి