Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన

27-02-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళికను మండల విద్యాశాఖ అధికారి–1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, జీవితంలో పదో తరగతి ఉత్తీర్ణత ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరీక్షలను భయంతో కాకుండా ఆసక్తితో రాయాలని, ఆందోళనతో చదివితే ఫలితం ఉండదని సూచించారు. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు వందరోజుల ప్రణాళికను క్రమంగా అనుసరించి సిద్ధమైతే 100 శాతం ఉత్తీర్ణత సాధించడం కష్టం కాదని తెలిపారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

అనంతరం తెలుగు విషయానికి సంబంధించిన సందేహాలను విద్యార్థుల నుంచి స్వీకరించి, స్వయంగా వ్యాకరణ అంశాలు మరియు రామాయణానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అవగాహన కల్పించారు.

తదుపరి మర్రిబంధం ప్రాథమిక పాఠశాలను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) అమలు విధానాన్ని పరిశీలించారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగడి బక్కయ్య, సీత జ్యోతి, సహోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News