Sthanikam - Truth Matters
Logo

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

Updated : 24 Feb 2026 16:44 IST
As Preferred Source 1 min read
చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో  50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం, నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 11,450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు తెలిపారు.

గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో ముఖ్యంగా నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు వెల్లడించారు. పడిపోయిన పంటను నిలబెట్టేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పొలాల్లో అధికంగా నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కర్రలకు తేమ ఎక్కువసేపు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరో 10 నుండి 20 రోజుల్లో కండెలు పూర్తిగా ఎండే దశలో ఉన్నందున రైతులు కోతలకు సిద్ధంగా ఉండి పంటను కాపాడుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే కొద్దీ యూరియా అధికంగా వాడిన పొలాల్లో లేదా నేలలోని శిలీంద్రాల ప్రభావంతో ఆకు, కాండం ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందన్నారు. అజోక్సిస్ట్రోబిన్ 11 శాతం, టెబుకొనాజోల్ 18.3 శాతం మిశ్రమ మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేస్తే తెగుళ్లను సమర్థంగా నియంత్రించవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు.

రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news