Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

చాట్రాయి దీప చెరువులో యువకుడు మృతి.. మిస్టరీగా మారిన ఘటన

13-03-2026 283 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ధర్నా

విచారణ చేసి న్యాయం చేస్తాం: ఎస్ఐ రామకృష్ణ

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామ దీప చెరువులో యువకుడు మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. చాట్రాయి గ్రామానికి చెందిన అంబటి అనుదీప్ (19) చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు గురువారం మధ్యాహ్నం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన కొందరు యువకులు అనుదీప్‌ను చెరువులోకి తోసి హత్య చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

మృతుడు పోలవరం గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడని, దీనిపై ఆ యువతి తండ్రి మరియు అతని బంధువులు కలిసి పథకం ప్రకారం చెరువులోకి తోసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా యువతి తండ్రి తమ ఇంటికి వచ్చి “మా అమ్మాయితో మీ అబ్బాయి మాట్లాడితే చంపేస్తాం” అంటూ బెదిరించాడని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కూడా తమ ఇంటికి వచ్చారని, అనంతరం ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు.

సాయంత్రం 6 గంటల సమయంలో చెరువు వద్ద మృతుడి ఫోన్ ఉండగా, గంటలోపే అది పోలవరం గ్రామంలోని యువతి తల్లిదండ్రుల వద్దకు చేరిందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ డేటా, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ మందపాటి బసవారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చాట్రాయి ఎస్ఐ రామకృష్ణను కోరారు.

విచారణ చేపట్టాం: ఎస్ఐ

మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపట్టి దోషులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు.

Sthanikam

చాట్రాయి దీప చెరువులో యువకుడు మృతి.. మిస్టరీగా మారిన ఘటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News