Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:00 AM

ఛలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

ఛలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

ఛలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ
14-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా విద్యా హక్కుల పోరాటానికి పిలుపు

సూర్యాపేట: విద్యార్థులపై పెరుగుతున్న ఫీజుల భారం, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుడుతూ “ఛలో ఇందిరా పార్క్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ప్రతి ఒక్కరికీ మౌలిక హక్కు కావాలని, కానీ ప్రస్తుతం అది వ్యాపారంగా మారిపోవడం బాధాకరమని అన్నారు.

ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న “ఫీజుల దోపిడీపై పోరు – విద్యా హక్కు సాధనకై ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్, టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, మండలాధ్యక్షులు బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, మహిళా నాయకురాలు వర్రె కవిత, బొమ్మగాని సైదులు, వెంకటేశ్, సూపర్ సైదులు, వట్యాల శేఖర్, నెలచర్ల మధు, బానోత్ ఛాంప్ల, పగిళ్ల శరత్, లింగాల సైదులు, వట్టే లింగరాజు, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఛలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News