Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

చలో ఢిల్లీ విజయవంతం చేయాలి: బీసీ సంఘాల పిలుపు

26-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ బస్టాండ్ వద్ద సాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. మార్చి 30, 31 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో సెమినార్, జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, కుల గణన నిర్వహించడం, దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తగిన నిధులు కేటాయించడం లేదని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజిక వేత ఉద్యమకారుడు బెల్లి చంద్రశేఖర్, బీసీ యువజన సంఘం ఉమ్మడిజిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకల శ్రీనివాస్,దాసరి లవ్లేష్, దాసరి శ్రీనివాస్, గోగు లింగం, బెల్లి మధుకర్,మహేష్, నరారి మల్లేష్, వీరయ్య, సైదుల్ గౌడ్, విగ్నేష్, సత్తయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చలో ఢిల్లీ విజయవంతం చేయాలి: బీసీ సంఘాల పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News