Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:35 PM

చలి వేళ వరి నారుమడిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఏజాజ్ అలీ ఖాన్

చలి వేళ వరి నారుమడిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఏజాజ్ అలీ ఖాన్

చలి వేళ వరి నారుమడిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఏజాజ్ అలీ ఖాన్
December 29, 2025 06:48 AM 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారి తనిఖీలు

రామన్నపేట – స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండల వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో నిర్వహిస్తున్న స్టాక్, అమ్మకాల రికార్డులను పరిశీలించి, సరైన విధంగా మెయింటెనెన్స్ కొనసాగిస్తున్నందుకు దుకాణదారులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

తనిఖీల అనంతరం ఆయన రైతులకు ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరి నారుమడి పెంపకంలో రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మూసినీరు, మరికొన్ని ప్రాంతాల్లో బోరుబావి నీరు ఉండటం, చలి ప్రభావంతో వరి నారుకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అందక ఎదుగుదల లోపించే అవకాశం ఉందన్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంట పొలాల పరిస్థితిని స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వరి నారుమడికి చిలేటెడ్ జింక్ వినియోగించాలని, అలాగే 19-19-19 లేదా 13-0-45 వంటి నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించాలని తెలిపారు.

ఒక లీటర్ నీటికి

5 గ్రాముల చిలేటెడ్ జింక్,

1.5 గ్రాముల 19-19-19 లేదా 13-0-45 చొప్పున కలిపి నారుమడిపై స్ప్రే చేయాలని సూచించారు.

ఈ విధంగా సూక్ష్మ పోషకాలు అందిస్తే నారుమడికి రోగాలు, చీడపురుగుల బెడద తగ్గడంతో పాటు మంచి ఎదుగుదల వస్తుందని తెలిపారు. చలి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు వరి నారుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వ్యవసాయ అధికారి సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News