Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

చలి తీవ్రతతో వరిలో నారుమడులకు ముప్పు – రైతులు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు.మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్

31-12-2025 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట: వరిలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నారుమడుల యాజమాన్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం, మంచు కురిసే పరిస్థితుల్లో నారుమడులు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అవుతున్నాయని తెలిపారు.

చలి ప్రభావాన్ని తగ్గించేందుకు రాత్రి వేళల్లో నారుమడిలోని నీటిని తీసివేసి, తెల్లవారు జామున తాజా నీటిని పెట్టాలి. దీంతో నారుమడిలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మొక్కలు చలికి దెబ్బతినకుండా ఉంటాయని వివరించారు.

అలాగే నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతం ఇచ్చి, వాటిపై పలుచని పాలిథీన్ షీట్ లేదా యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలని సూచించారు. ఇది చలి గాలుల ప్రభావాన్ని తగ్గించి నారుమడులను కాపాడుతుందని చెప్పారు.

మంచు కురుస్తున్న సమయంలో ఆకులపై బూడిద (Ash) చల్లడం ద్వారా మంచు ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చని తెలిపారు. అలాగే చలికాలంలో తరచుగా కనిపించే జింకు లోపం సవరణకు లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేటు కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

నారుమడులు ఆరోగ్యంగా పెరగాలంటే పైపాటుగా 2 కిలోల యూరియా + 2 గ్రాముల కార్బండాజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని కలిపి వినియోగించాలి. అదేవిధంగా 19:19:19 ఎరువును 4–5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మొక్కలకు సమతుల్య పోషకాలు అందుతాయని తెలిపారు.

చలి కారణంగా వచ్చే అబియోటిక్, బయోటిక్ స్ట్రెస్ తగ్గించడంలో Isabion (అమినో ఆమ్లాలు + పెప్టైడ్స్) కీలకంగా ఉపయోగపడుతుందని, దీనిని లీటరు నీటికి 1.0–1.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

ఈ సూచనలను క్రమబద్ధంగా అమలు చేస్తే, చలి తీవ్రత ఉన్నా సరే వరిలో నారుమడులు సురక్షితంగా పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

చలి తీవ్రతతో వరిలో నారుమడులకు ముప్పు – రైతులు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు.మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News