చౌటుప్పల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మావయ్య మొగుదాల స్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎమ్మార్వో వీరాభాయి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మరణించిన స్వామి గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆత్మీయంగా మాట్లాడి ఓదార్పు నిచ్చారు.పరామర్శ కార్యక్రమంలో ఆర్‌ఐ సుధాకర్, రామిరెడ్డి, సర్వేయర్ మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవగోని వెంకటేష్ గౌడ్, బొంగు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి