Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

చదువుతో పాటు క్రీడలు అవసరం – సీఎం కప్ ప్రారంభంలో ఎమ్మెల్యే పిలుపు

05-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ ప్రతి నియోజకవర్గంలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను ఈ రోజు నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ శివారులో ఉన్న రెసిడెన్షియల్ కళాశాల మైదానంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో కూడా జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆ పోటీలలో ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని సూచించారు.మన నియోజకవర్గానికి అతి త్వరలోనే ఆధునిక వసతులతో కూడిన ఇండోర్ మరియు ఔట్‌డోర్ క్రీడా మైదానాలను మంజూరు చేయించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ప్రజా ప్రభుత్వం యువత అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.విద్య, క్రీడలు,ఆరోగ్యం అన్నింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో పాల్గొని విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నారాయణఖేడ్ మండల రెవెన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల విద్యా అధికారి, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, క్రీడాకారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

చదువుతో పాటు క్రీడలు అవసరం – సీఎం కప్ ప్రారంభంలో ఎమ్మెల్యే పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News