Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:19 PM

బోరంచ శివారులో నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు

12-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పురాతనమైన, అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రాతఃకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో సాంప్రదాయబద్ధంగా అలంకరించి పూజలు చేశారు.ఉదయం నుంచే ఆలయ పరిసర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. మానూర్ మండలంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పొరుగుజిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, యువతులు ప్రత్యేక వ్రతాలు ఆచరించగా, కొందరు భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఉన్నప్పటికీ మంజీర నది ఒడ్డున వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం విశేషమైన ఆధ్యాత్మిక ఖ్యాతిని సొంతం చేసుకుందని తెలిపారు. ఈ ఆలయానికి సంబంధించిన మొక్కులు అత్యంత ప్రాముఖ్యత కలవిగా భావించబడుతున్నాయని, భక్తులు మనస్ఫూర్తిగా కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల అపార విశ్వాసమని అన్నారు.ప్రత్యేకంగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన ప్రాప్తి, ఉపాధి, పంటల సమస్యలు వంటి అంశాల్లో అమ్మవారి కృపతో పరిష్కారం లభిస్తుందని భక్తులు నమ్ముతారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరతో పాటు ప్రత్యేక పండుగల సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారని తెలిపారు. మంజీర నది ఒడ్డున సహజ సౌందర్యాల మధ్య వెలసిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు మనోశాంతిని అందిస్తుందని వివరించారు.అలాగే గ్రామ అభివృద్ధి, ప్రజల క్షేమం కోసం కూడా అమ్మవారిని ప్రార్థించారని తెలిపారు. ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం భక్తుల సహకారం ఎంతో అవసరమని, అందరూ అమ్మవారి సేవలో భాగస్వాములవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

బోరంచ శివారులో నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News