Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం

27-03-2026 173 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వంలో వైభవంగా వేడుకలు

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బో గారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వం వహించారు.

ఉదయం రామాలయంలో గణపతి హోమంతో ప్రారంభమైన కార్యక్రమాలు రేణుక ఎల్లమ్మ తల్లికి టెంకాయల సమర్పణ, బొడ్రాయి పూజలతో కొనసాగాయి. అనంతరం హోమం నిర్వహించి స్వామివారి ఎదురుకోలు ఘనంగా జరిపారు.

ముత్యాల పందిరిలో జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులను ఆకట్టుకుంది. దేవాలయ ప్రాంగణంలో శ్రీరామ నామస్మరణ మారుమోగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని కనులపండువగా మార్చారు.

తదనంతరం 1993-94 ఏడవ తరగతి బ్యాచ్ సభ్యులు అన్నదానం నిర్వహించారు. మహిళలు, యువత, గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరి, మాజీ సర్పంచ్ అంతటి పద్మా రమేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, అడ్వకేట్ కందగట్ల శ్రీనివాస్, కునూరు శ్రీనివాస్ గౌడ్, తెలుసూరి మల్లేష్ యాదవ్, గోగు మధు యాదవ్, గోగు సత్యనారాయణ యాదవ్, బద్దుల మహేష్ యాదవ్, అంతటి మల్లేశం గౌడ్, వనం నరసింహ, గండూరి వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి రాజు, మేడి కృష్ణ, చెరుకు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News