Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:34 PM

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

04-02-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొండపల్లి దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వెన్న కవిత శ్రీనివాస్ రెడ్డి, గుండు స్వరూప్ రెడ్డి, వారితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోదల రంగారెడ్డి, కుంభం అనీల్ కుమార్ రెడ్డి, వీరేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News