Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:52 AM

భూవివాదం బలి… తుమ్మలపెనపహాడ్‌లో మహిళ హత్య

18-05-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఘటన స్థలం పరిశీలించిన ఎస్పీ నరసింహ

బూ సంబంధిత తగాదాల నేపథ్యంలో తుమ్మలపెనపహాడ్ గ్రామంలో జరిగిన మహిళ హత్య ఘటన కలకలం రేపింది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించి సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన అంజమ్మను ఆమె సోదరుడు సైదులు భూవివాదాల కారణంగా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. సోమవారం ఉదయం పనిమీద వెళ్లుతున్న సమయంలో విచక్షణ రహితంగా దాడి జరిపినట్లు వెల్లడించారు.

ఘటన ప్రదేశంలో క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసును వేగంగా దర్యాప్తు చేసి కోర్టుకు పంపించాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ సంబంధిత తగాదాలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘించి హత్యలు, దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గతంలో గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో జరిగిన భూవివాద హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. నిందితుడు సైదులుపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ పరిశీలనలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్సైలు మహేష్, ఐలయ్య, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూవివాదం బలి… తుమ్మలపెనపహాడ్‌లో మహిళ హత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News