Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు

23-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:

భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రధానమంత్రి సంసద్ ఖేల్’ మహోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేశారు.

భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, కోకో తదితర క్రీడల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా మోత్కూర్ మండలం దత్తప్పగూడ గ్రామానికి చెందిన క్రీడాకారులు వాలీబాల్‌లో ప్రథమ, కబడ్డీలో ద్వితీయ స్థానాలు సాధించి రూ.75,000 నగదు బహుమతిని అందుకున్నారు.

విజేతలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తుంగతుర్తి ఇన్‌చార్జ్ కడియం రామచంద్రయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, మోత్కూర్ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్, ఉపాధ్యక్షులు గుంటి సతీష్, రాధారపు మల్లేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News