Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:47 AM

భువనగిరిలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ విజయవంతం

09-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రీడలపై అవగాహన పెంచడమే లక్ష్యం

స్థానికం:భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా యువజన క్రీడల శాఖ – యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ శుక్రవారం భువనగిరి పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ ర్యాలీ భువనగిరి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) నుండి ప్రారంభమై,చారిత్రక భువనగిరి ఫోర్ట్ వరకు కొనసాగింది. క్రీడాభిమానులు,యువత,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ,త్వరలో జరగబోయే సీఎం కప్ క్రీడాపోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించడం,పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ టార్చ్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి దోహదపడతాయని,యువత క్రీడల వైపు మరింత ఆకర్షితులయ్యేలా క్రీడా జ్యోతి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలని క్రీడాభిమానులను కోరారు.ఈ కార్యక్రమం ద్వారా సీఎం కప్‌కు సంబంధించి ప్రజల్లో మంచి స్పందన ఏర్పడిందని,రాబోయే రోజుల్లో క్రీడల పట్ల యువత మరింత చురుకుగా పాల్గొంటారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

భువనగిరిలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ విజయవంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News