Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:31 AM

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం

28-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యదాద్రి-భువనగిరి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. బోనగిరి కోర్టు ఆవరణలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో న్యాయమూర్తి స్వయంగా ఒక కేసును పరిష్కరిస్తూ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు మాట్లాడుతూ, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. చిన్న చిన్న వివాదాలను పరస్పర రాజీతో స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 2,193 కేసులు పరిష్కరించబడ్డాయి. వీటిలో 7 సివిల్ కేసులు, 2,163 క్రిమినల్ కేసులు, 23 పీఎల్‌సీ కేసులు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, రెండవ తరగతి మెజిస్ట్రేట్ జ్యోతిరావు, లోక్ అదాలత్ సభ్యులు జి. నాగేంద్రమ్మ, కె. మల్లేష్, సి.హెచ్. ఐలయ్య, కె. గోపాల్ రావు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News