Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

భువనగిరి అర్బన్ హెల్త్ సెంటర్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

15-04-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, డాక్టర్లు మరియు సిబ్బంది హాజరు వివరాలను రిజిస్టర్ల ద్వారా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందుబాటులో ఉండి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు.

ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి ప్రతిరోజు వచ్చే పేషెంట్ల సంఖ్యను తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి, వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది తమను సక్రమంగా చూసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

అవసరమైన మందులు సరిపడా నిల్వలో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

Sthanikam

భువనగిరి అర్బన్ హెల్త్ సెంటర్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News